హైదరాబాద్‌లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్)
మొత్తం ఖాళీలు: 201
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)/డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికవిధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్ ఏలో మొత్తం 80 ప్రశ్నలు కోర్ టెక్నికల్ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్ బి నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో..
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2022
దరఖాస్తులకు చివరితేది: జూలై 5,2022.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే తేది: 23.7.2022.
పరీక్షతేది: 31.07.2022.
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com