Monday, December 23, 2024

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో 1271 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

TSSPDCL Recruitment 2022 Notification Out

1,271 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,271 పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో జూనియర్ లైన్‌మెన్, సబ్ – ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులున్నాయి. ఈ నెల 11న పూర్తి నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఎస్‌ఎస్‌పిడిసిఎల్ తెలిపింది. సంబంధిత విభాగంలో ఐటిఐ, బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా అధికారులు తెలిపారు. వీటిల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 70, సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 201, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1,000 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమవుతుండగా పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ http://tssouthernpower.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News