- Advertisement -
హైదరాబాద్: టెట్ 2024 దరఖాస్తు గడువును పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారంతో టెట్ దరఖాస్తు గడువు ముగియడంతో.. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పింది. మరో 10 రోజులు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించింది.
మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,20,364 వచ్చాయని తెలిపింది. ఇక, టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనుంది. జూన్ 12న ఫలితాలను వెల్లడిస్తారు.
- Advertisement -