- Advertisement -
టిఎస్‌టిపిసి డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
మనతెలంగాణ, హైదరాబాద్ : రెండు నెలల నుంచి జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని టిఎస్‌టిపిసి డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన నగరంలోని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. నగరానికి చెందిన షేక్ ముస్తాఫా టిఎస్‌టిపిసి చైర్మన్ దేవర మల్లప్ప వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. షేక్ మస్తఫాకు రెండు నెలల నుంచి జీతం ఇవ్వడంలేదు. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉందని పలుమార్లు చైర్మన్ మల్లప్పను అడుగగా తనను ఇష్టాను సారంగా తిట్టాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించానని చెప్పాడు. టిఎస్‌టిపిసి చైర్మన్ దేవర మల్లప్ప దగ్గర బాధితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
- Advertisement -