Sunday, December 22, 2024

సోషల్ వెల్ఫేర్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పట్ల టిఎస్ యుటిఎఫ్ హర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్ ) కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా ఆసంఘం అధ్యక్షులు కె. జంగయ్య, చావ రవి మాట్లాడుతూ 2007 నుండి కాంట్రాక్టు పద్ధతిలో నామ మాత్రపు వేతనాలతో పని చేస్తున్నారని సర్వీసును క్రమబద్దీకరించాలని దశాబ్ద కాలంగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.

2017 లో 18 రోజులపాటు సమ్మె చేస్తే వారిని రెగ్యలరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇంత కాలానికి ప్రభుత్వం హామీ నెరవేర్చినందుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి గురుకుల ఉపాధ్యాయుల విభాగం కన్వీనర్లు డి ఎల్లయ్య, ఎస్ శ్రీజన, జి రాంబాబు, పి హరీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News