Tuesday, November 5, 2024

సిద్దిపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం

- Advertisement -
- Advertisement -

తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన  జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు . వివరాలు ఇవి.

– రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల  ఆమోదం.

– రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్‌విసి ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.

– రూ.1.88 కోట్లతో జిఎన్‌సి, హెచ్‌విసి, ఏఎన్‌సి, ఎస్‌ఎన్‌సి ఉప విచారణ కార్యాలయాల ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ఆమోదం.

– రూ.40.50 కోట్లతో తిరుమలలో వేస్ట్‌ ప్యాకేజికి గాను మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్‌ఎంఎస్‌ సేవలను ముంబయికి చెందిన ఫెసిలిటీ అండ్‌ ప్రాపర్టీ మేనేజర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అందించేందుకు టెండర్లు ఆమోదం.

– అదేవిధంగా, రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్‌, వకుళామాత విశ్రాంతి గృహం, పిఏసి`3, 4, బి టైప్‌, డి టైప్‌ క్వార్టర్స్‌ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఎస్‌ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్లు ఆమోదం.

– రూ.3.55 కోట్లతో తిరుమలలో పోలీస్‌ క్వార్టర్స్‌ అభివృద్ధికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.

– రూ.3.10 కోట్లతో తిరుమలలో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చెత్తకుండీల ఏర్పాటుకు పరిపాలన అనుమతి.

– రూ.5 కోట్లతో తిరుపతిలోని ఎస్వీ వేద వర్సిటీ ప్రాంగణంలో స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి ఆమోదం.

– రూ.7.44 కోట్లతో టీటీడీలోని వివిధ విభాగాల అవసరాల కోసం వర్క్‌లోడ్‌ ప్రకారం కంప్యూటర్లు కొనుగోలుకు నిర్ణయం.

– రూ.9.50 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్‌ రికార్డు స్టోర్‌ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.

– 2024 సంవత్సరానికి గాను క్యాలెండర్లు, డైరీల ముద్రణకు నిర్ణయం.

– రూ.2 కోట్లతో నగరి సమీపంలోని బుగ్గలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీకాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం.

– రూ.4.15 కోట్ల శ్రీవాణి నిధులతో కర్నూలు జిల్లా, అవుకు మండలం, సీతారామపురం గ్రామంలోని శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి 4 రాజగోపురాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– స్విమ్స్‌ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్‌, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్‌ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్‌ గోడౌన్‌ నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– రూ.4 కోట్ల దాతల విరాళంతో ఒంటిమిట్టలో అన్నప్రసాద భవనం భవనం నిర్మాణానికి ఆమోదం.

– రూ.6.65 కోట్లతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి ఇత్తడిగ్రిల్స్‌ అమర్చడానికి టెండర్లు ఆమోదం.

– రూ.5.61 కోట్లతో తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– నంద్యాల జిల్లా యాగంటిలో రూ.2.40 లక్షలతో టీటీడీ కల్యాణ మండపం నిర్మిస్తాం.

– ధర్మప్రచారంలో భాగంగా జమ్మూలో 24 నెలల వ్యవధిలో శ్రీవారి ఆలయం నిర్మించి, ఈ నెల 8వ తేదీన మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. 

– మే నెలలో ఏజన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరంలో శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. ఈ ఆలయాల వద్ద కల్యాణమండపాలు నిర్మించి గిరిజనులు ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం.

– తెలంగాణలోని కరీంనగర్‌లో ఇటీవల శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశాం. అదేవిధంగా, సిద్ధిపేటలో 6 ఎకరాల స్థలం కేటాయిస్తామని శ్రీవారి ఆలయం నిర్మించాలని ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడ స్వామివారి ఆలయం నిర్మిస్తాం.

– త్వరలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో, ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

– తిరుమలకు నిషేధిత పదార్థాలు తీసుకురాకుండా అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద పటిష్టంగా తనిఖీలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి  నిషేధిత పదార్థాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల వెహికల్‌ స్కానర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

           ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్‌, మూరంశెట్టి రాములు, మారుతిప్రసాద్‌, మధుసూదన్‌ యాదవ్‌, పార్థసారథి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News