- Advertisement -
తిరుమల: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం.. ఈ విధానం మార్చి 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. విఐపి బ్రేక్, రూ.300 దర్శనం టికెట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో విఐపి బ్రేక్ దర్శనం, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఒక ప్రజాప్రతినిధి రోజులో ఒకసారి మాత్రమే అనుమతి ఇస్తామని.. ఒక లేఖపై ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
- Advertisement -