- Advertisement -
తిరుపతి: టిటిడి హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు టిటిడి చేపట్టిన కల్యాణమస్తు కార్యక్రమానికి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాకేంద్రాల్లో ఆగస్టు 7న ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. నూతన వధూవరులకు ఉచితంగా పెళ్లి సామగ్రి, రెండు గ్రాముల పుస్తెలు, నూతన వస్త్రాలను అందిస్తారు. మీకు తెలిసిన వాళ్లకు సమాచారం తెలియచేయండి
- Advertisement -