Wednesday, January 22, 2025

సర్వదర్శనం భక్తుల వసతులను పరిశీలించిన టిటిడి ఛైర్మన్ భూమన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్వదర్శనం భక్తుల కోసం టిటిడి కల్పించిన వసతులను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు. సామాన్య భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, త్రాగునీరు, కాఫీ, టీ వంటివి సకాలంలో అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సరిపోయేంతగా అన్నప్రసాదాలు పెట్టాలని సిబ్బందికి సూచించారు. క్యూ కాంప్లెక్స్ లోకి ఎన్ని గంటలకు ప్రవేశించారు. దర్శనానికి ఎంత సమయం పడుతోందన్న విషయాలను భక్తుల నుండి అడిగి మరీ తెలుసుకున్నారు.

ఉదయం నుండి ఇప్పటివరకు 47 కంపార్ట్ మెంట్ల నుంచి టోకెన్ లేని భక్తులను దర్శనానికి పంపామని, దర్శనానికి 14 గంటల సమయం పడుతోందని ఛైర్మన్‌కు విజిలెన్స్ అధికారులు ఆయనకు వివరించారు. అంతకుముందు సామాన్య భక్తుడి తరహాలో వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ లోకి ఛైర్మన్ ప్రవేశించారు. మెటల్ డిటెక్టెర్ ద్వారా స్వయంగా తనిఖీలు చేయించుకున్నారు.

Bhoomana

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News