తిరుమల: భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్థరాత్రి 1.30కి చిరుత పులి బోనులో చిక్కిందని పేర్కొన్నారు. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ శాఖ అధికారుల సూచనతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదని హితువు పలికారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని వెల్లడించారు. మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతలు పట్టుకోగా 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు.
Also Read: లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)