Monday, December 23, 2024

తిరుమలలో 80 శాతం గదులు సామాన్య భక్తులకే…

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో వేసవి ఏర్పాట్లపై టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే నెల నుంచి నడిచి వచ్చేవారికి దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. అలిపిరి నడకదారిలో రోజుకు 10 టోకెన్లు, శ్రీవారిమెట్టు నడకదారిలో రోజుకు 5 వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. 3 నెలల పాటు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేయొద్దని సూచించారు. తిరుమలకొండపై 40వేల మందికి మాత్రమే వసతి సౌకర్యం కల్పించే అవకాశముందని టిటిడి పేర్కొంది. తిరుమలలో 80శాతం గదులను సామాన్య భక్తులకే కేటాయిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. భక్తుల కోసం 24 గంటల పాటు కల్యాణకట్ట అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News