Friday, December 20, 2024

వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు అనుమతించం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్లు టిటిడి చైర్మన్ వైవి సబ్బారెడ్డి తెలిపారు. అయితే, వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించమని స్పష్టం చేశారు. స్వయంగా వచ్చిన విఐపిలకే దర్శనం కల్పిస్తామని, చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించమని చెప్పారు. గదుల మరమ్మతుల కారణంగా ఏకాదశి రోజున.. ప్రజాప్రతినిధులకు నందకం, వకులా గృహంలో గదులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక వేళ తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

TTD Chairman YV Subbareddy Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News