- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం వారం రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.ఆదివారం తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ అనంతరం శుద్ధి చేసి ఉదయం 6 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుతిస్తారు. అదేవిధంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరుస్తారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -