Monday, January 20, 2025

నడక మార్గంలో తిరుమల దివ్వదర్శనం టోకెన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  భక్తుల కోరిక మేరకు నడక మార్గంలోనే తిరుమల వెంకన్న దర్శనం టోకెన్లు అందజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. సోమవారం తిరుమల అన్నయయ్య భవన్‌లో ఈవో ఏ.వి ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10వేలు, శ్రీవారి మెట్ల మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లను మంజూరు చేస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆ తరువాత భక్తుల సూచనలు పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్ధం దీన్ని చేపడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 15నుంచి జులై 15వరకూ భక్తుల రద్దీ ఎక్కవగా ఉంటుందన్నారు. సామన్యభక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్ , శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శనం టికెట్లు తగ్గించుకున్నామన్నారు. ఈ మూడు నెలలపాటు విఐపి సిఫారసు లేఖలను తగ్గించుకోవాని కోరారు. మాడవీధుల్లో భక్తుల సౌకర్యం కోసం కూల్ పెయింట్ వేయిస్తామని తెలిపారు. కొండపైన 85శాతం గదులను సామాన్యభక్తులకే కేటాయిస్తామని తెలిపారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, పాత అన్న దానం కాంపెక్లు , ఏఏసి 2,4తోపాటు నారాయణ గిరి ఉద్యాన వనాల్లోని క్యూలైన్లు ,కంపార్టుమెంట్లలో అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. టిటిడి విజిలెన్స్ ,పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్ సౌకర్యంతపాటు , ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News