Wednesday, January 22, 2025

తిరుపతి వెంకన్నకు రెండున్నర లక్షల కోట్ల ఆస్తి..

- Advertisement -
- Advertisement -

తిరుపతి వెంకన్న ఆస్తుల విలువ
రెండున్నర లక్షల కోట్లు
10 టన్నులకు పైగా బంగారం ..
నగలపై బ్యాంకుల నుంచి కోట్ల వడ్డీలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధీనంలోని ఆస్తుల విలువ అంతా కలిపితే రూ 2.5 లక్షల కోట్లుదాటాయి. ఆదివారం ఈ లెక్కల వివరాలను టిటిడి అధికారవర్గాలు తెలిపాయి. నగలు, స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకులలోని డిపాజిట్లు ఇతర మొత్తం ఈ స్థాయిలో ఉంటుంది. తిరుపతి వెంకన్న పరిధిలో పది టన్నులకు పైగా బంగారం, రూ 15,900 కోట్ల నగదు ఉంది. పలు వాదనల నేపథ్యంలో వెంకన్న ఆస్తుల వివరాలపై టిటిడి ఇప్పుడు శ్వేతపత్రం వెలువరించింది. ఎఫ్‌డిలు, బంగారం నిల్వల రూపంలోని ఆస్తుల విషయాలను వెల్లడించింది. మిగులు మొత్తాలను కేవలం షెడ్యూల్డ్ జాతీయ బ్యాంకులలో డిపాజిటు చేసినట్లు, కొందరు చెపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీల పరిధిలోకి ఇతరత్రా పథకాలకు దారిమళ్లించడం జరగలేదని వివరించారు. భక్తులు దేశ విదేశాల నుంచి అందించే విరాళాలతో ఆదాయం ఇనుమడిస్తోంది. వడ్డీరేట్లు పెరుగుతూ ఉండటంతో ఏటా ఎఫ్‌డిల రూపంలో ఉంచే ధనం, ఇతరత్రా సొమ్ములపై ఆదాయం పెరుగుతోంది. భూములు, భవనాల రూపేణ కూడా ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. ఇక అత్యంత విలువైన పురాతన నగలు వజ్రవైఢూర్యాలు, కాటేజ్‌లు, అతిథి భవనాలకు వచ్చే అద్దెలు, భక్తులకు సమకూర్చే సౌకర్యాలతో వచ్చే ఆర్థిక వనరులు గురించి కూడా తెలిపారు. కొన్ని రకాల ఆదాయాలు సార్వత్రిక ఆదాయ విలువల పరిధిలోకి రావని వీటిని వేరే విధంగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఇక పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులలో టిటిడి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ 15,938 కోట్ల స్థాయికి చేరాయి. ఇవి 2019 జూన్ నాటికి రూ 13,025 కోట్లుగా ఉన్నాయి. ఈ లెక్కన ఎఫ్‌డి మొత్తాలు రికార్డు స్థాయిలో పెరిగిందని వెల్లడైంది.

2019 జూన్‌లో బంగారం నిల్వలు 7.3 టన్నులు ఉండగా ఇప్పుడు ఇవి 10.25 టన్నులకు చేరాయని ప్రకటనలో తెలిపారు. టిటిడి 202223 వార్షిక బడ్జెట్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువరించారు. ఇందులో బ్యాంకులలో డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ 668 కోట్లు పైబడి ఉంటుందని తెలిపారు. ఇక రూ 1000 కోట్ల ఆదాయం హుండీలో నగదు కానుకల రూపంలోనే వస్తోంది. ఏటా దాదాపు రెండున్నర కోట్ల మంది చెల్లించుకునే వెంకన్న ముడుపులతో ఈ ఆదాయం దక్కుతోంది. ఇటీవలే ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లలో టిటిడి బంగారం డిపాజిట్లపై వచ్చే మొత్తంతో మంచి వడ్డీని పొందుతోంది. దేశవ్యాప్తంగా టిటిడికి 900 కు పైగా స్థిరాస్తులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 7000 ఎకరాల మేర ఉంటాయి. పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిషా, హర్యానా ఇతర ప్రాంతాలలో టిటిడి ఆధ్వర్యంలో వందలాది దేవాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన రూ 3100 కోట్ల వార్షికబడ్జెట్‌లో ఆదాయ వివరాలను పొందుపర్చారు.

TTD declared Tirumala Venkateswara Swamy Assets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News