Monday, December 23, 2024

తిరుపతిలో అగ్నిప్రమాదం.. రథం దగ్ధమైందన్న దానిపై టిటిడి ఈవో స్పందన

- Advertisement -
- Advertisement -

తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. 10 ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనాస్థలిని టిటిడి ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గోవిందరాజ స్వామివారి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. అగ్నిప్రమాద స్థలానికి చాలా దూరంలో రథం ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఈవో ధర్మారెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News