Thursday, January 23, 2025

దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి : టీటీడీ ఈవో 

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి చెప్పారు.

అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గడువులోగా పూర్తి అయిన పనుల గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణంకోసం సేకరించిన భూమిలో ఉన్న రుయా ఆసుపత్రి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సివున్నందువల్ల ఈ వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రుయా అధికారులకు సూచించారు. స్థలం గుర్తించి కొత్త భవనం నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం  ధర్మారెడ్డి మీడియా తో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఆసుపత్రిని ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. అనుకున్న గడువు ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లల హృదయాలయం(గుండె చికిత్సల ఆసుపత్రి) ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల సరసన చేరిందని ఈవో వివరించారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1450 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు చెప్పారు.అలాగే జీవన్ దాన్ కింద నాలుగు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో చిన్న పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు న్యూరో, న్యూరో సర్జరీ, పల్మనాలజి, యూరాలజి తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అనంతరం ఈవో తన కార్యాలయంలో ఆసుపత్రి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. జేఈవో  సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వర రావు, ఎస్ఈ  వెంకటేశ్వర్లు, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్  లక్ష్మణ మూర్తి, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్ ఎంవో డాక్టర్ భరత్, ఈఈకృష్ణా రెడ్డి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News