Saturday, January 4, 2025

అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఇఒ జె.శ్యామలరావు

- Advertisement -
- Advertisement -

ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద వున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మగళవారం టిటిడి ఇఒ జె.శ్యామల రావు సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి వివరాలను టిటిడి ఈవోకు ఆలయ అధికారులు వివరించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను, నిర్మాణానికి సంబంధించిన వివరాలను, ఆలయంలో రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు.

టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచియుండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహనమండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1వ తేదీ, వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News