- Advertisement -
62 ఎకరాల భూమి కేటాయింపు
జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లో దేవాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడికి) అనుమతి దక్కింది. జమ్మూ కశ్మీర్‌లోని మజీన్ గ్రామంలో ఆలయ నిర్మాణానికి అధికార యంత్రాంగం అనుమతిని ఇచ్చి, ఇందుకోసం 62 ఎకరాల స్థలం మంజూరు చేసింది. ఇటీవలే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడిన మండలి సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి టిటిడికి స్థల కేటాయింపు ప్రతిపాదనను ఆమోదించింది. శ్రీనగర్ పఠాన్‌కోట్ హైవే వెంబడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించారు. ఆలయం అనుబంధ నిర్మాణ వ్యవస్థల ఏర్పాటుకు ఇచ్చే భూమిని టిటిడికి 40 ఏండ్ల లీజు ప్రాతిపదికన కేటాయించారని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. యాత్రా పర్యాటక రంగం విలసిల్లే దిశలో చేపట్టిన చర్యల్లో భాగంగా టిటిడికి ఈ కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు.
- Advertisement -