Monday, December 23, 2024

తిరుమల భక్తులకు పెద్ద షాక్‌.. అద్దె భారీగా పెంపు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో వసతి గృహాల అద్దె ధరలు పెంచి భక్తులకు టీటీడీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు‌. నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత ధరలను రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచినట్లు సమాచారం. నారాయణగిరి రెస్ట్‌హౌస్‌లోని 1,2,3 గదుల ధరలను కూడా అధికారులు రూ.150 నుంచి రూ.1700కు పెంచారు.

రెస్ట్ హౌస్ 4 అద్దె ధరలు రూ.750 నుంచి రూ.1700కి పెరిగాయి. జీఎస్టీతో కలిపి కార్నర్ సూట్ ధర రూ.2200కి పెరిగింది. ప్రత్యేక కాటేజీల గది అద్దెలు రూ.750 నుంచి రూ.2800కి పెరిగాయి. అద్దె పెంచడమే కాదు, అద్దెతోపాటు భక్తులు అంతే మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుందని టిటిడి అధికారులు వెల్లడించారు. అటు 50, 100 అద్దెతో లభించే అద్దె గదుల్లోనూ వసతులు కల్పించి, అద్దె పెంచేందుకు టిటిడి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
వసతి గృహాల అద్దెల ధరలు పెంచడంతో సామాన్యు భక్తులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News