Tuesday, January 21, 2025

తిరుమలలో ఎస్‌ఈడి,శ్రీవాణి టికెట్లు, గదుల కోటా 10న విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు, రూ.10 వేల శ్రీవాణి టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 2.25 లక్షల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేల చొప్పున 20 వేల శ్రీవాణి టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు ,గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News