Monday, December 23, 2024

దర్శనం టికెట్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి డిసెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లను టిటిడి విడుదల చేసింది. డిసెంబర్ 16,31 తేదీలు మినహా.. మిగితా తేదీల టికెట్లు అందుబాటులో ఉంచింది. online.tirupati balaji.ap.gov.in వెబ్ సైట్లో లేదా గోవిందా యాప్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఇలా బుక్ చేసుకోండి…

రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టిటిడి అధికారికవెబ్‌సైట్ లోకి వెళ్లాలి. తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ముందే రిజిస్టర్‌ చేసుకున్న భక్తులు లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. అనంతరం లేటెస్ట్‌ అప్‌డేట్‌లో ఉండే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్‌ చేయాలి. తరువాత మనకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్‌ చేసుకొని డబ్బు చెల్లించాలని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News