Friday, January 10, 2025

తిరుమల నడకదారుల్లో పిల్లలపై టిటిడి ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల నడకదారిలో భక్తుల భద్రతకు సంబంధించి టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. రెండో ఘాట్‌ రోడ్డులో సాయంత్రం 6 గంటల తర్వాత బైక్‌లను నిషేధించారు. అలిపిరి నుంచి గాలి గోపురం 7వ మెట్టు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

దర్శనం కోసం దారిలో నడిచే భక్తుల భద్రతకు సంబంధించి ముఖ్యమైన ఆంక్షలు విధించారు. ఇక నుంచి అలిపిరి-తిరుమల మార్గంలో వంద మంది భక్తులను దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వారి రక్షణ కోసం ముందు, వెనుక తాడు, సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని టీటీడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News