Monday, January 20, 2025

జులై 23న ఆన్‌లైన్‌లో ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

- Advertisement -
- Advertisement -

TTD Senior Citizen Online Darshan 2022

తిరుమల: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టిటిడి అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News