Monday, January 20, 2025

కరీంనగర్ లో టిటిడి ఆలయ శంకుస్థాపన మహోత్సవం

- Advertisement -
- Advertisement -

అశేష జనవాహిని సమక్షంలో అద్వితీయ క్రతువులు

ఉదయం 7.20 గంటలకు శంకుస్థాపన

కుటుంబ సమేతంగా పూజలు నిర్వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల 20 నిమిషాలకు శంకుస్థాపన జరగబోయే కార్యక్రమంలో విశేష పూజల్ని టిటిడి వేద పండితులు నిర్వహించారు.

అంతకు ముందు బుధవారం ఉదయం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, టిటిడి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు, ఎంపి దీవకొండ దామోదర్ రావు, సాదర స్వాగతం పలికి దేవాలయ నిర్మాణ ప్రాంగణానికి ఆహ్వానించారు. ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన గజరాజులు కార్యక్రమాన్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News