Wednesday, January 22, 2025

జూలై 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుపతి: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.

ఇందులో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

అక్టోబరు నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News