- Advertisement -
హైదరాబాద్: ఈనెల 9వ తేదీన ఆన్‌లైన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. జవనరి 12 నుంచి 31వ తేదీ వరకు, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈనెల 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి అధికారులు కోరారు.
ఇదిలావుండగా, పద్మవతి అమ్మవారిని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణకు టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి , ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో జస్టిస్ రమణను సన్మానించి వేద ఆశీర్వాదం చేసి, తీర్ధప్రసాదాలను అందజేశారు.
- Advertisement -