Monday, January 20, 2025

రేపు టిటిడి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్ లక్కీడీప్ నిర్వహించనున్నారు.

లక్కీడీప్‌లో టికెట్లు పొందిన భక్తులు నిర్దేశిత రుసుం చెల్లిచి టికెట్లను ఖరారు చేసుకోవాలని టిటిడి సూచించింది. అలాగే టిటిడి ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News