- Advertisement -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం తిరుమల మొదటి ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద టిటిడి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను కొట్టింది. ఈ
ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
- Advertisement -