Monday, December 23, 2024

చంద్రబాబుకు మద్దతుగా నేడు టిటిడిపి నిరాహార దీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు.. సోమవారం ఉదయం 9. గం లకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్ నందు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు ఏపిలో టిడిపి అధినేత చంద్రబాబు జైలులోనే ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్న క్రమంలో ఆయనకు మద్దతుగా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా నిరాహార దీక్ష చేపడతానని ప్రకటన చేశారు.

దీంతో వారికి మద్దతుగా తెలంగాణలోనూ నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాసాని జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాసాని పిలుపు నిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News