Monday, December 23, 2024

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల బెలూన్ల ఎగురవేసిన టి టిడిపి శ్రేణులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టి టిడిపి శ్రేణులు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం
నల్ల బెలూన్ల ఎగురవేసి నిరసన తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నల్ల బెలూన్లు ఎగురవేసి, పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ జన్మభూమి , ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలను చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించారని గుర్తు చేశారు. సెక్రటేరియెట్ లో పెండింగ్ లో పడిపోయిన లక్షలాది ఫైళ్లను క్లియరెన్స్ చేసి ప్రజా సమస్యలను చంద్రబాబు పరిష్కరించారని ఆయన అన్నారు.

బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి నాయకులను రాష్ట్రానికి రప్పించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఘనత చంద్రబాబుది అన్నారు. జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబుని అరెస్టు చేస్తే అవినీతి బయటకు వస్తుందని జగన్ అనుకున్నాడు, కానీ ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చిందన్నారు. బాధితులు బయటకు వస్తారని జగన్ భావిస్తే లబ్ధి దారులు బయటకు వచ్చారన్నారు. చంద్రబాబు పై రాజకీయ దాడి అంటే యువత, భవిత, పెట్టుబడుల, అభివృద్ధిపై దాడి చేసినట్టేనన్నారు. చంద్రబాబు నీతికి, నిజాయితీకి మారు పేరని, నీతి గెలవాలని, జయానికి విజయం కలగాలని, తెలుగు వారందరి ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని అన్నారు. ఇందుకోసం తాము ఎంతటి పోరాటమైనా చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్, గడ్డి పద్మావతి, జక్కిలి ఐలయ్య యాదవ్, జివిజి నాయుడు, అనుబంధ సంఘాల అధ్యక్షులు షకీలా రెడ్డి, శ్రీపతి సతీష్, పోలంపల్లి అశోక్, హరికృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో..పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు అధ్యక్షులు సాయిబాబా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, అనూప్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు సంధ్య పోగు రాజశేఖర్,మేకల బిక్షపతి ముదిరాజ్, సాంబశివ రావు, రాములు, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News