Wednesday, January 22, 2025

16న దేశ వ్యాప్త సమ్మెకు టిటిడిపి మద్దతు : బక్కని నర్సింహులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అఖిలపక్ష పార్టీల దేశవ్యాప్త సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ మాజీ ఎంఎల్‌ఏ బక్కని నర్సింహులు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో మహేశ్వరం నియోజకవర్గం పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. బక్కని నర్సింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిఎన్‌టియూసి రాష్ట్ర అధ్యక్షులు ఎంకె. బోస్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీశ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్. దుర్గా ప్రసాద్, నాగర్ కర్నూల్ ఇన్ ఛార్జీ శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ, మండల కమిటీల ఏర్పాటు టిడిపి పార్టీ బలోపేతం తదితర అంశాలపై నేతలు చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బక్కని నర్సింహులు మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ కోసం అందరం అంకిత భావంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో టిడిపికి అనేక రూపాల్లో కష్టాలు వచ్చాయన్నారు. 2014-19లోనూ, 2018లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎంఎల్‌ఏలను బిఆర్‌ఎస్ పార్టీ లాగేసుకున్నదన్నారు. ఇప్పుడు మనం యువత, మహిళలలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News