Monday, January 20, 2025

పాణం మీదకు తెచ్చిన పిట్ట చేష్టలు.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఒక పక్షి చేసిన పని రైల్వే టిటిఇ ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. బుధవారం స్టేషన్ ప్లాట్‌ఫారం మీద ఇద్దరు టిటిఇలు నడుచుకుంటూ వెళుతుండగా ఒక పక్షి విడిచిపెట్టిన కరెంట్ వైరు తగిలి అందులో ఒక టిటిఇ విద్యుదాఘాతానికి లోనయ్యాడు. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆ టిటిఇ ప్లాట్‌ఫామ్ పైనుంచి ట్రాక్ మీదకు విరుచుకుపడిపోయాడు.

ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన మరో టిటిఇ అక్కడ నుంచి పరుగెత్తాడు. ఈ దృశ్యాలన్నీ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు తీవ్రంగా గాయపడిన టిటిఇని ఖరగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ టిటిఇ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News