Thursday, January 23, 2025

టిటిపి మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్‌లు బలి

- Advertisement -
- Advertisement -

పెషావర్ : పాకిస్థాన్ కల్లోలిత ఖైబర్ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం తెహ్రీక్‌ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి)మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్‌లు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని బజౌర్ జిల్లా మముండ్ తెహశీల్ ప్రాంతంలో పోలియో వ్యాక్సినేషన్ బృందాలకు సెక్యూరిటీ కోసం వ్యాన్‌లో పోలీస్ బలగాలు వెళ్తుండగా ఈ బాంబు దాడి జరిగింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాడి జరిగిన ప్రాంతంలో వైద్య శిబిరాన్ని ఆపివేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెపికె అర్షాద్ హుస్సేన్ ఈ దాడిని ఖండించారు. చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకు ఉగ్రవాదులపై పోరాటం సాగుతుందని ఆయన హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌లో తరచుగా పోలియో వైద్య బృందాలపై ఉగ్రమూకల దాడులు సాగడం పరిపాటి అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News