Monday, December 23, 2024

స్పోర్ట్ కోచ్‌లుగా పనిచేయడానికి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation of applications to serve as Sports Coaches

 

హైదరాబాద్ : గిరిజన సంక్షేమ మోడల్స్ స్పోర్ట్ స్కూల్స్‌లో ఔట్‌సోర్సింగ్ పద్దతి లో పనిచేయడానికి అర్హులైన వారి నుండి గిరిజన సంక్షేమ శాఖ ధరఖాస్తులను ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లా జాతర్ల, ఎహెచ్‌ఎస్ (బాలురు), బిడి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని ఎహెచ్‌ఎస్ (బాలురు), బిడికొత్తగూడెం జిల్లా కాచనపల్లి ఎహెచ్‌ఎస్ (బాలికలు), హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్ అకాడెమి ఎహెచ్‌ఎస్‌లో కోచ్‌లుగా ఔట్‌సోర్సింగ్ పద్దతిలో 2022 23 సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేస్తున్నారు. కబడ్డి, ఆర్చెరీ, వాటర్ స్పోర్ట్ (కాయకింగ్ కెనోయింగ్, సెయిలింగ్) లలో ఒక సంవత్సరం ఎన్ ఎస్ ఎన్‌ఐఎస్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తమ రెజ్యూమ్‌తో పాటు sportsofficertwd@gmail.com మెయిల్ కు లేదా మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్ లోగల గిరిజన సంక్షేమ శాఖ అకడమిక్ సెల్ నందు జులై 14 లోగా సమర్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సూచించారు. పూర్తి వివరాలకు సెల్ 9908550250, 9247267050 నెంబర్లకు అన్ని పనిదినాల్లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News