- Advertisement -
బెంగళూరు : కరోనా నుంచి కోలుకున్న 155 మందిలో టిబి (క్షయ) లక్షణాలను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా వారిని కూడా అప్రమత్తం చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఏమాత్రం క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నా తక్షణమే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే కర్ణాటకలో టీబీ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ఈ సర్వేలో కొవిడ్ నుంచి కోలుకున్న బాధిత వ్యక్తులకు చెందిన 6,02,887 ఇళ్లను సందర్శించారు. 24,598 మందిలో టీబీ లక్షణాలు బయటపడగా, ప్రస్తుతం 104 మంది టీబీ బారిన పడ్డట్టు తేలింది. కొవిడ్ బాదిత వ్యక్తుల కుటుంబ సభ్యులను పరీక్షించగా, 8523 మందిలో లక్షణాలను గుర్తించారు. వీరిలో 51 మందిలో టిబి నిర్ధారణ లయింది.
- Advertisement -