Monday, January 20, 2025

యాక్షన్‌తో కూడిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ’టక్కర్’. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘టక్కర్‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్, డి.సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ వేడుకలో డి.సురేష్ బాబు మాట్లాడుతూ “సిద్దార్థ్ నాకు చాలా కాలం నుండి మంచి ఫ్రెండ్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.

దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ మాట్లాడుతూ “మా గురువు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడే అదే బాటలో ఆయన శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది”అని అన్నారు. హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ “ఇది ఒక యాక్షన్ ఫిల్మ్. ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్. ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్‌గా ఉంటే ఎలా ఉంటుందో ఆవిధంగా నన్ను చూపించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంశ కౌశిక్, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News