Sunday, December 22, 2024

రేపు కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం (ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి లు), పార్లమెంటరీ పార్టీ ( రాజ్యసభ, లోక్‌సభ సభ్యు లు), పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారానే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఇడి, ఐటి సంస్థలు దాడులపై కూలంకషంగా చర్చించనున్నారని తె లుస్తోంది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేస్తున్న ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రం నుంచి వచ్చిన దూతలు టిఆర్‌ఎస్ శాసనసభ్యులను ప్రలోభపెట్టేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయి న వ్యవహారంతో పాటు మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ సాధించిన విజయంతో పాటు బిఆర్‌ఎస్‌ను దేశ వ్యా ప్తంగా విస్తరింపజేసే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మంత్రి నరేంద్రమోడీ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కూలంకశంగా సమావేశంలో చర్చించనున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై కాలు క్రమపద్దతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడని పోస్టుల్లో పెంచిన రిజర్వేషన్లను అమలయ్యేలా గత ప్రతిపాదనలకు ఆయా విభాగాలు సవరణలు చేస్తున్నాయి.

ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 4 సహా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విభాగాలలో ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చి, నోటిఫికేషన్లు వెలువడని ఉద్యోగాలకు పెరిగిన గిరిజన రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా విభాగాలు కసరత్తు చేస్తున్నాయి. రోస్టర్ పాయింట్ కేటాయింపు ప్రక్రియిన వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

సంక్షేమ విభాగాల్లోని గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 9 వేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేసి.. జోన్లు, మల్టీ జోన్లు, జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించింది. ఈ మేరకు గురుకుల సొసైటీలు సవరణ ప్రతిపాదనల మేరకు గురుకుల బోర్డుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నాయి. తాజాగా రోస్టర్ ఖరారు కావడంతో గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల భర్తీకి సైతం పెరిగిన గిరిజన రిజర్వేషన్ల మేరకు సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలని సంబంధిత విభాగాలను టిఎస్‌పిఎస్‌సి సూచించినట్లు తెలిసింది. నెలాఖరులోగా ప్రతిపాదనలు వస్తే.. వాటిలో లోటుపాట్లను సరిచూసి, నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.

రోస్టర్ పాయింట్లే కీలకం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. ఉద్యోగాల నియామకాలలో రోస్టర్ పాయింట్లే కీలకం. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. రోస్టర్ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే… ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో… తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News