Monday, December 23, 2024

ప్రేమించిన టీచర్‌కు పెళ్లి నిశ్చయం.. విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Tuition teacher arrested for falling in love with student

చెన్నై: అంబత్తూరులో ప్లస్ 2 విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రేమవలలో పడేసిన ట్యూషన్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరులోని ఓ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షర్మిల సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత తన ఇంటి వద్దే విద్యార్థులకు ట్యూషన్లు చెబుతోంది. ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది విద్యార్థులు ఆమె దగ్గర చదువుకునేవారు. కల్లికుప్పంకు చెందిన కృష్ణకుమార్ అనే ప్లస్ 2 విద్యార్థి షర్మిల దగ్గర ట్యూషన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం ట్యూషన్ కు వచ్చే కృష్ణకుమార్‌తో సన్నిహితంగా ఉండే టీచర్ షర్మిల అతడిని ప్రేమ వలలో పడేసింది. ఈ క్రమంలో ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కలిసి తమ సెల్‌ఫోన్లలో చాలా ఫొటోలు దిగి, వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను షేర్ చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో తనతో మాట్లాడటం, పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పడికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందకున్న పోలీసులు టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News