Saturday, January 4, 2025

పదో తరగతి బాలుడితో పారిపోయిన ట్యూషన్ టీచర్ చెల్లి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ట్యూషన్‌కు వచ్చి పదో తరగతి బాలుడితో టీచర్ చెల్లెలు పారిపోయిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎంజిఆర్ నగర్‌లో ఓ బాలుడు పదో తరగతి ఫెయిల్ కావడంతో ఓ ఇంటికి ట్యూషన్‌కు వెళ్లాడు. ట్యూషన్ టీచర్ చెల్లి(23) ఆ బాలుడితో ప్రేమాయణం నడిపించింది. ఈ నెల 16న బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సదరు యువతి బాలుడితో పాటు రాహుల్ అనే వ్యక్తితో పుదుచ్చేరికి పారిపోయినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని చెన్నైకి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఉండేందుకు రాహుల్ సహాయం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News