Thursday, January 23, 2025

తుల రాశివారికి ఈ ఏడాది ఆస్తిపాస్తులు పెరుగుతాయి!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 02 వ్యయం : 08
రాజ : 01 అవమానం : 05

చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు, విశాఖ 1,2,3 పాదముల యందు పుట్టినవారు “రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు తులారాశికి చెందినవారు.

తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలలో భ్రమ లేకుండా భ్రమలో బతకకుండా పనిచేయడం మంచిది. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలం. విదేశాలలో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిది. దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహువు ఉండడమే కారణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆహారపు అలవాట్లు నిర్ణయాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం అవసరం. అశ్రద్ద చేస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆహార రంగంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని మనందరికీ విదితమే. జాగ్రత్త వహించండి.

వ్యాపారం, తినుబండారాల వ్యాపారాలలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కల్తీ రాజ్యమేలుతోంది. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈ.ఎన్.టికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, పాదాలు, వెన్నుముక నొప్పులు బాధిస్తాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఆహార, ఆరోగ్య నియమాలను పాటించండి. అరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించిన ంతగా ఉండదు. వృత్తిపరంగా స్థాన చలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది.

ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలం గా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్ఠిని కేంద్రీకరించడం వలన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంత సానుకూలమైనఫలితాలు గోచరిస్తున్నాయి.ఋణ సంబంధమైన విషయాలలో ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. అప్పుల జోలికి వెళ్ళితే వేసుకోవడానికి జోళ్ళే లేకుండాపోతాయనేలా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ద్వాదశ రాశు ల వారికన్నా ఈరాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం. మంత్రసిద్ధి లభించడానికి, సాధనకు సరైన కాలం. అన్నదానాలు, సేవా కార్యక్రమాలలో విరివిగా పనిచేస్తు న్న వారికి అనుకూల కాలం. కెమెరాల ముందు వెనుక పని చేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పవచ్చును.

మంచి ప్రాజెక్టులు లభించి ఉన్నతస్థితికి వెళ్ళే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకి ప్రశంసలు, సన్మానాలు దక్కుతాయి. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంత వరకు మీరు చేసే వృత్తి వ్యవహారాలలో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. హర్డ్ వర్క్, హార్డ్ అవర్స్‌లో పనిచేసే సందర్భాలు రావచ్చు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దీనికి కారణం రాహువు 6వ స్థానంలో ఉండటమే కారణం. నూతన గృహం తీసుకునే వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంలో స్వగృహ కల నెరవేరు కాలం అని చెప్పవచ్చును. కొంత ఆలస్యం అయినా కూడా మీరు మీకు నచ్చిన విధంగా స్వంత ఇంటి కల నెరవేర్చుకుంటారు. మీ అభిరుచికి అనుగుణంగా గృహ నిర్మాణం లేదా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వివాహం కాని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సరైన సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.

ప్రయత్న లోపం లేకుండా ఉంటే తప్పకుండా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదర్శవంతమైన మనస్సుతో ఎంతో శ్రమించి ఒక పునర్వివాహం జరగడానికి కారణం అవుతారు. మగపిల్లల పెళ్ళి విషయం పెను సమస్యగా మారుతుంది. దానికి కారణం ఒకటని చెప్పలేము. వా రి జాతకలోపం కావచ్చు, ఆడపిల్లలు దొరకక ఇ తరత్రా విషయాల వలన వివాహం జాప్యం అవ డం పరిపాటిగా తయారైంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకి ప్రేమ పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పద మవుతాయి. ప్రేమ వ్యవహారాలు మూడునాళ్ళ ము చ్చటగానే ఉంటాయి. అభిప్రాయబేధాలు తలెత్తి కొన్ని ఇబ్బందులు ఎదొర్కొనవలసి వస్తుంది. పె ళ్ళికి ముందు ఉన్న ప్రేమ, అప్యాయతలు వివాహానంతరం లేకపోవడం, పెద్దల నిర్ణయాలు వ్య తిరేకించడం వాటివలన ఎన్నో సమస్యలను అనుభవించవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News