తుల…
వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7
ఏప్రిల్21 నుండి గురుసంచారం, అక్టోబర్ 31 నుండి రాహువు సంచారం అనుకూలం. శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. చిత్రవిచిత్రమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. గురుబలం వల్ల అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఖ్యాతి, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. లౌక్యంతో మీ కార్యదక్షతను నిరూపిస్తారు. ఆర్థికంగా విశేషంగా అభివృద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగార్ధులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖరీదైన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. శనిసంచారం కొంత ప్రతికూలతగా ఉండవచ్చు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు రావచ్చు.
అవివాహితులకు వివాహయోగం. కొన్ని కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో జతకడతారు. లాభనష్టాలు సమతూకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. వీరికి పదోన్నతులు లభించవచ్చు. పారిశ్రామిక, శాస్త్రవేత్తలకు శుభదాయకమైన కాలం. కళాకారులకు మరిన్ని అవకాశాలు అవలీలగా దక్కుతాయి. రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. వీరికి అనూహ్యమైన ఆహ్వానాలు రాగలవు. వ్యవసాయదారులు రెండుపంటలూ లాభపడతారు. ఆషాఢం, శ్రావణం, మార్గశిరం, మాఘమాసాలు సానుకూలమైనవి. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు శనీశ్వరునికి, రాహువునకు పరిహారాలు చేయించుకోవడం మంచిది.