Sunday, December 22, 2024

బీజేపీకి తుల ఉమ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

బిజేపికి ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ గుడ్ బై చెప్పారు. ఆమె సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖ పంపించారు. వేములవాడ టికెట్ ను మొదట ఉమకు ఇచ్చిన బిజేపి అధిష్ఠానం, ఆఖరి నిమిషంలో ఉమను కాదని, సిహెచ్ వికాస్ రావుకు కేటాయించింది. వికాస్ రావు బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కుమారుడు. ఈ పరిణామం పట్ల ఉమ కలత చెందారు. ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ కన్నీళ్లపర్యంతమయ్యారు కూడా.

ఉమ త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిసింది. వేములవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బీజేపిలో చోటు చేసుకున్న పరిణామాలను గమనించిన శ్రీనివాస్, ఉమను కలసి తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈటల రాజేందర్ కు ఉమ సన్నిహితురాలు. రాజేందర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు, ఉమ కూడా ఆయనతోపాటే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, బిజేపీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News