Wednesday, January 29, 2025

వేములవాడలో నామినేషన్ను ఉపసంహరించుకున్న తుల ఉమ..

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తుల ఉమ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. సిరిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమకు బిజెపి మొదట వేములవాడు టికెట్ ప్రకటించింది. దీంతో ఆమె బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసింది. అయితే, చివరి నిమిషంలో బిజెపి వేములవాడ అభ్యర్థిని మార్చింది. తుల ఉమకు బదులుగా వికాస్ రావుకు టికెట్ ఇచ్చింది.

తనకు టికెట్ దక్కకపోవడంతో బిజెపి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తుల ఉమ కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆమెతో సంప్రదింపులు జరిపి.. బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆమె బీఆర్ఎస్ లో చేరారు. వేములవాడలో బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పోటీ చేస్తుండడంతో.. తన నామినేషన్ ను తుల ఉమ ఉపసంహరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News