Monday, December 23, 2024

రాఖీ గిఫ్ట్‌గా అక్కకు తులాభారం

- Advertisement -
- Advertisement -

సోదరికి తమ్ముడి వినూత్న కానుక,  కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుతో తులాభారం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : అన్నాచెల్లెల అనురానికి ప్రతీక అయిన రాఖీ పండగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన అక్కకు ఒక తమ్ముడు ఎవ్వరూ ఉహించనివిధంగా వినూత్న కానుక అందించి అందరిని అశ్చర్యానికి గురిచేశారు. జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అదరిపోయే గిప్ట్‌ను అందించారు. అన్నాచెల్లల, అక్క తమ్ముళ్ళ వాత్సల్యం, అప్యాయత, ప్రేమ అనుబంధానికి నిదర్శనంగా శుక్రవారం రక్ష బంధన్ పండగను అంతా కన్నులపండువగా జరుపుకున్నారు. తోడబుట్టిన సోదరి తమ్ముడు లేదా అన్నకు రాఖీ కట్టితే చిరే, సారే కానుకగా ఇవ్వడం తెలుగుంటి సంప్రదాయం. మరి కొందరూ తమకు తోచిన విధంగా నగదు లేదా ఇతర విలువైన వస్తువులను, బంగా రు అభరణాలను కానుకగా అందిస్తుంటారు. కానీ, ఖమ్మం నగరానికి చెందిన ఓ తమ్ముడు వినూత్నంగా ఆలోచించి తనకు రాఖీ కట్టిన సోదరికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి బంధుమిత్రుల సమక్షంలో తులాభారం వేసి తన అభిరుచిని నెరవేర్చుకున్నాడు. సుమారు రూ.50 వేలకు సరిపడే రూ.5 క్యాయిన్లతో అక్కకు తులాభారం వేసి తన అభిరుచిని నెరవేర్చకున్నాడు.
ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ సమీపంలో ఉండే బొలగాని బసవ నారాయణఅరుణ దంపతుల కుమారుడు త్రివేదికి శుక్రవారం తన సోదరి రణశ్రీ రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తన సోదరికి కానుకగా ఇంట్లోనే ఒక వేడుక ఏర్పాటు చేసి దగ్గర బంధుమిత్రులను ఆహ్వానించి సోదరి రణశ్రీకి తులాభారం వేశాడు. చిన్నప్పటి నుంచి తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న నగదును రూ.5 నాణేలుగా మార్చి తులాభారం వేశారు. ఈ వేడుకల్లోనే తన సోదరుడికి రణశ్రీ రాఖీ కట్టగా సోదరి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ విధంగా తనకు కానుక అందించడం ఎంతో సంతోషంగా ఉందని సోదరి రణశ్రీ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News