Sunday, January 12, 2025

రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో వ్యవసాయ రంగం సాధించిన విజయాలు, పురోభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ లో 35 శాతం కేవలం వ్యవసాయ రంగానికే కేటాయించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు.  నేటికి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు రూ. 20 వేల కోట్ల మేరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో సర్కారు జమా చేసిందని తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా గత ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి రూ. 7625 కోట్లు రైతులకు చెల్లించలేదన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి రూ. 7625 కోట్లను రైతుల ఖాతాల్లో జమా చేశారని తెలిపారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు, ఖమ్మంలో కొబ్బరి బోర్టు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని కూడా తుమ్మల తెలిపారు.

ఈ సంక్రాంతి తరువాత రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నగదు జమతో పాటు సన్నాలకు బోనస్ కూడా ఇస్తామని తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News