Friday, November 22, 2024

ఆ కంపెనీలకు రుణాలు ఇస్తారు… రైతులకు ఎందుకు ఇవ్వరు: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు వస్తున్నాయని, తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. మ్యారీగోల్డ్ హోటల్‌లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృత చర్చ జరిగింది. బ్యాంకర్ల సమావేశంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అంశంపై కీలక చర్చ జరిగిన సందర్భంగా తుమ్మల మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని, దశాబ్ధాలుగా రైతేరాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తూ భయం వేస్తోందన్నారు. బహుళజాతి, ఇన్ఫ్రా కంపెనీలకు రూ. వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని అడిగారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయని, పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం ఉండకూడదని, రైతులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేయమంటే బ్యాంకర్లు ఎందుకు స్పందించడంలేదని తుమ్మల ప్రశ్నించారు. నిబంధనలు ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని తుమ్మల సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News