Wednesday, January 22, 2025

ఆ ప్రాజెక్టు పూర్తి చేయటమే నా రాజకీయ లక్ష్యం: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సత్తుపల్లి మండలం యతాలకుంట వద్ద టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని, సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైందని యతాలకుంట టన్నెల్ అని తుమ్మల ప్రశంసించారు. టన్నెల్ పనులు రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటమే తన రాజకీయ లక్ష్యమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News