Saturday, March 29, 2025

రుణమాఫీ చేయకుండానే అలా మాట్లాడటం సిగ్గుచేటు: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ పూర్తిగా చేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మండిపడ్డారు. పదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుమ్మల శాసన సభలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సగం మందికే రూ.లక్ష రుణమాఫీ చేశారని, రైతులకు రుణమాఫీ చేయకుండానే బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు. తొలి పంట కాలంలోనే రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని, ఒకే దఫాలో 25,35,964 మంది రైతులకు రూ.20617 కోట్లు రుణమాఫీ చేశామని తుమ్మల ప్రకటించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అసెంబ్లీలో పలు శాఖల పద్దులపై చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News