Sunday, November 24, 2024

అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: తుమ్మల నాగేశ్వరరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికార బిఆర్ఎస్ పాలనపై మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని తుమ్మల ఆరోపించారు. నవంబర్ 30న చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. గాంధీల కుటుంబం వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. గతంలో ఆదర్శ కమ్యూనిస్టు నేతలతో పనిచేశానని చెప్పిన తుమ్మల ప్రజా వ్యతిరేక పాలనపై జనం విసతుగెత్తారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

అటు కాంగ్రెస్ లో సీటు ఖరారు కావడంతో మాజీమంత్రి తుమ్మల జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను అదుపుచేసే శక్తి లేదని తుమ్మల ఆరోపించారు. కొందరి చేతుల్లో రాష్ట్ర దోపిడీకి గురవుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ఆదివారం బిజెపి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికలకు ముందు గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ సస్పెన్షన్‌ను భారతీయ జనతా పార్టీ ఆదివారం నాడు ఉపసంహరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News